తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆడుకోవడానికని వెళ్లి.. అనంతలోకాలకు..! - karimnagar district crime news

ఆడుకోవడానికని వెళ్లిన బాలుడు మురుగునీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

boy fell into a ditch and died
boy fell into a ditch and died

By

Published : Apr 28, 2021, 2:46 AM IST

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మురుగునీటి గుంతలో పడి శిరిగిరి బన్ని అనే బాలుడు మృతి చెందాడు.

బన్ని ఆడుకోవడానికని ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఇంటి సమీపంలోని మురుగునీటి గుంతలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని గుంతలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతదేహం వద్ద ఆ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

ఇదీ చూడండి: కారు ఢీకొట్టిన ఘటనలో బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details