తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుట్టపై గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం - దేవరకద్రలో మృతదేహం లభ్యం

మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమయింది. మృతుని వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

The body of an unidentified youth was found in Mahabubnagar district
The body of an unidentified youth was found in Mahabubnagar district

By

Published : Jun 4, 2021, 8:43 AM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గద్దె గూడెం అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. స్థానిక పశువుల కాపర్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై భగవంత్ రెడ్డి స్థానికులతో కలసి గుట్టపైకి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు.

మృతదేహం పక్కన ఒక క్రిమిసంహారక మందు డబ్బా ఉన్నట్టు తెలిపారు. మృతుని వివరాలు, మృతికి గల కారణాలు ఉందని విచారణలో తెలుస్తాయని ఎస్ఐ తెలిపారు. మృతదేహం ఫోటోలు వివిధ మాధ్యమాల ద్వారా పంపించారు. ఫోటోలను చూసి ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Loan App Case: దా'రుణ' యాప్​ కేసులో మరొకరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details