కోయంబత్తూర్ టెక్నాలజీ సాయం.. ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యం - hyderabad latest crime news
![కోయంబత్తూర్ టెక్నాలజీ సాయం.. ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యం the-body-of-a-man-who-fell-into-a-manhole-and-was-found-a-week-ago-has-been-found](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12718408-992-12718408-1628497234026.jpg)
13:24 August 09
మ్యాన్‌హోల్‌లో పడి వారం క్రితం గల్లంతైన అంతయ్య
హైదరాబాద్ నగరంలోని సాహెబ్‌నగర్‌లో గల్లంతైన పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు గత మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో 800ఎంఎం సివర్ ట్రంక్ పైపు లైన్‌లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. డ్రైనేజీలో పడిన ఇద్దరిలో శివ మృతదేహం ఇప్పటికే లభ్యమైంది.
కోయంబత్తూర్ టెక్నాలజీ సాయంతో ఓ కెమెరాను సివర్ ట్రంక్ పైపులోకి పంపి మృతదేహాన్ని సామానగర్ వద్ద గుర్తించారు. అక్కడికి చేరుకున్న అతడి కుటుంబ సభ్యులు మృతదేహం అంతయ్యదే అని నిర్ధరించారు. కార్మికుడి ఆచూకీ కోసం అధికారులు డ్రోన్ కెమెరాలు, 300 మంది పురపాలక సిబ్బంది, 4 రెస్క్యూ టీంలు, ఎండమాలజీ, ఇంజినీరింగ్ సిబ్బందిని ఉపయోగించారు.
ఇదీ చూడండి:Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు