మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. వారాల వ్యవధి ఉన్న పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బండ్లగూడ ఆర్‌జీకే రోడ్డు సమీపంలో నెలల వయసున్న మగబిడ్డను వదిలి వెళ్లారు. ఆ దారి వెంబడి వెళ్తున్న గుండ్లపల్లి వినయ్ గౌడ్ అనే ఆటో డ్రైవర్.. బాబు ఏడుపును గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
అమానవీయం: రోడ్డు పక్కన పసికందు.. చేరదీసిన పోలీసులు - telangana news
తల్లి పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలి వెళ్లిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలో చోటుచేసుకుంది. దారి వెంబడి వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్.. బాబు ఏడుపును గమనించి... పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు పసికందును సంరక్షణ కోసం నాగారంలోని జగతి ఆసుపత్రికి తరలించారు.
![అమానవీయం: రోడ్డు పక్కన పసికందు.. చేరదీసిన పోలీసులు medchal district, baby found in keesara, jagathi hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12255098-763-12255098-1624588816562.jpg)
మేడ్చల్ జిల్లా, కీసరలో పసికందు, జగతి ఆసుపత్రి
వెంటనే అక్కడికి చేరుకున్న కీసర పోలీసులు బాబును తీసుకుని ... చుట్టుపక్కల విచారించారు. తక్షణమే పసికందు సంరక్షణ కోసం నాగారంలోని జగతి ఆసుపత్రికి తరలించారు. శిశు సంక్షేమ విభాగానికి సమాచారం అందించారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పసికందు తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే కీసర పోలీసులకు తెలియచేయాలని సీఐ నరేందర్ గౌడ్ స్థానికులను కోరారు.