తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు! - తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి ఓ యువతిని కత్తితో పొడిచి హతమార్చాడు. మృతురాలు ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు!
Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు!

By

Published : Aug 15, 2021, 12:50 PM IST

Updated : Aug 15, 2021, 4:13 PM IST

ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పిదాలు దారుణ ఫలితాలను మిగుల్చుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో గుంటూరులోని పరమాయికుంట వద్ద టిఫిన్​ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతి దారుణ హత్యకు(murder in guntur) గురైంది. పట్టపగలే ఈ ఘటన జరగడం.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో అల్పాహారం తీసుకెళ్లేందుకు హోటల్​కు వచ్చిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులను కత్తితో బెదిరించి.. ద్విచక్ర వాహనంపై దుండగుడు పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. ఘటనకు గల కారణాలను మృతురాలి తల్లి, సోదరుడిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అడిగి తెలుసుకున్నారు. మృతురాలు బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. యువతికి పరిచయం ఉన్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి హత్యతో తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

ఇదీచదవండి: FATHER HARRASMENT CASE: మరో పది నిమిషాల్లో అమెరికా ఫ్లైట్‌.. అంతలోనే పోలీసులకు చిక్కాడు

Last Updated : Aug 15, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details