రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్స్టేషన్ నుంచి పరారైన నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఇవాళ ఉదయం నాలుగు గంటల నుంచి డ్రోన్ కెమెరాలు, ఫతేపూర్ యూత్ మెంబర్స్, పోలీస్ సిబ్బంది గాలించి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. వికారాబాద్ నగర శివారులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ తరలించగా రాత్రి కావడంతో జైలు అధికారులు అనుమతించకపోవడంతో ఆరుగురిని శంకర్ పల్లి పీఎస్కు తీసుకొచ్చారు.
ఉదయం నాలుగు గంటలకు టాయిలెట్కని వెళ్లిన ఎ1 నిందితుడు మహమ్మద్ హరిషత్(22) పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో నిందితుడి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు చివరికి పట్టుకుని పీఎస్కు తరలించారు