తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనానం, కారు ఢీ.. ఓ వ్యక్తి మృతి - Rangareddy District Latest News

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ సర్వీస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని జైలో కారు ఢీ కొట్టింది. రంగారెడ్డి జిల్లా ఎల్కగూడ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

The accident took place on Rajendranagar Appa Junction Service Road
అప్పా జంక్షన్ వద్ద ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి

By

Published : Mar 5, 2021, 9:49 PM IST

ద్విచక్రవాహనాన్ని జైలో కారు ఢీకొట్టడం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ సర్వీస్ రోడ్డులో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎల్కగూడకు చెందిన రాంచందర్ అనే సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందాడు.

ద్విచక్రవాహనంను జైలో కారు ఢీకొట్టడంతో రాంచందర్​ అనే వ్యక్తి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. అతని మీది‌ నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పదిహేను నిమిషాల‌ క్రితమే ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:హెల్మెట్​ ధరించట్లేదా...? వాహనాదారులు తస్మాత్​ జాగ్రత్త..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details