మద్యం మత్తు, మితిమీరిన వేగానికి హైదరాబాద్ ఓఆర్ఆర్పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పీకల్లోతు తాగిఉన్నవారు శంషాబాద్ రాళ్లగూడ వద్ద స్తంభాన్ని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళుతుండగా ఘటన జరిగిందని వెల్లడించారు.