వేగంగా వచ్చిన ఓ డీసీఎం.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న డేవిడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు తీవ్రంగా గాయపడ్డారు.
Accident: కారును ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి - అతివేగం వల్ల ప్రమాదాలు
కరీంనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు వెళ్తోన్న ఓ డీసీఎం.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
బాధితులు మంచిర్యాలలోని ఓ వివాహ వేడుకకు హాజరుకావడానికి వెళ్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. రహదారిపై నిలిచిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.