కుమురం భీం జిల్లా వాంకిడి పరిధి గోయెగాం వద్ద నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసగిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితుల నుంచి 112 విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల విలువ సుమారు రూ. లక్షా 70 వేలు ఉంటుందని అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు వివరించారు.
Fake seeds: రూ. లక్షా 70 వేల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత - నకిలీ విత్తనాలతో నష్టాలు
కుమురం భీం జిల్లా వాంకిడి పరిధిలో 112 నకిలీ విత్తనాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలు
జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అచ్చేశ్వర్ రావు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దని సూచించారు.
ఇదీ చదవండి:కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!