తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tension at Rudrangi PS: ట్రాక్టర్​తో ఢీకొట్టి దారుణ హత్య.. పీఎస్​ను ముట్టడించిన గ్రామస్థులు - రుద్రంగి పోలీస్‌స్టేషన్

Tension at Rudrangi PS: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపేయడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి అప్పగించాలంటూ పీఎస్​ను ముట్టడించారు.

Tention at Rudrangi PS
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

By

Published : Jun 16, 2022, 3:08 PM IST

Updated : Jun 22, 2022, 1:57 PM IST

Tension at Rudrangi PS: నిందితుడినికి తమకు అప్పగించాలంటూ గ్రామస్థులు పీఎస్​ను ముట్టడించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ భూవివాదంలో నర్సయ్య అనే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన కిషన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్‌స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

హత్య అనంతరం నిందితుడు కిషన్ నేరుగా పోలీస్‌స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. విషయం తెలిసి ఆగ్రహంతో గ్రామ ప్రజలు కిషన్‌పై దాడి చేసేందుకు పీఎస్‌లోకి చొచ్చుకెళ్లారు. నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. వారి ఆందోళనతో స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. రుద్రంగి పీఎస్‌కు చందుర్తి నుంచి అదనపు బలగాలను తరలించారు. అయితే మృతుని భార్య పోలీసులకు తాళిబొట్టు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

రెండేళ్లుగా భూవివాదం:రెండేళ్లుగా సాగుతున్న గొడవను పోలీసులు పరిష్కరించక పోవడం వల్లనే పరిస్థితి హత్యకు దారి తీసిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో చనిపోయిన నర్సయ్య శవాన్ని పోలీస్‌ స్టేషన్‌ ముందు పెట్టి ఆందోళన దిగారు. రుద్రంగికి చెందిన నీవూరి నర్సయ్య, నీవూరి కిషన్​ల మధ్య భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు గొడవపడి పోలీస్​స్టేషన్‌కు వెళ్లినా వివాదం కొలిక్కి రాలేదు. నర్సయ్య ద్విచక్రవాహనంపై వస్తున్న విషయాన్ని గమనించిన కిషన్‌ ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో వెంటనే నిందితుడు పోలీసులకు లొంగిపోగా మృతుని బంధువులు, గ్రామస్థులు కిషన్‌ను తమకు అప్పగించాలంటూ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. దీనితో చందుర్తి నుంచి అదనపు బలగాలను రప్పించారు. వేములవాడ డీఎస్పీ మృతుని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే యత్నం చేశారు. మృతుని బంధువులు శవాన్ని పోలీస్‌ స్టేషన్‌ ముందు పెట్టి ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Last Updated : Jun 22, 2022, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details