తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యార్థిని ఆత్మహత్య.. వాళ్లే కారణమా? - తెలంగాణ వార్తలు

కరోనా తర్వాత పాఠశాల ప్రారంభమయ్యే నాడే పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధ్యాయుల ఒత్తిడి వల్లే తమ కూతురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

tenth-class-student-suicide-at-yellandu-in-bhadradri-kothagudem-district
పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థిని ఆత్మహత్య... టీచర్లే కారణమా?

By

Published : Feb 5, 2021, 2:16 PM IST

పాఠశాలలు ప్రారంభమయ్యే నాడే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే తమ కూతురు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని హర్షిత ఖమ్మంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆన్లైన్ పాఠాలు వింటోంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలకు రావాలని ఉపాధ్యాయులు ఫోన్లు చేశారు.

ఈ క్రమంలో పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రెండు రోజుల పాటు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం మరణించింది. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి:పంట రుణాల కుంభకోణం.. పోలీసుల అదుపులో 10 మంది

ABOUT THE AUTHOR

...view details