తెలంగాణ

telangana

ETV Bharat / crime

టెన్త్ ఫెయిల్​ అయ్యానని.. కాలువలో దూకిన విద్యార్థిని! - పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య తాజా నేర వార్తలు

Tenth Class Student Suicide: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్​ అయ్యాననే మనస్తాపంతో.. ఓ విద్యార్థిని కాలువలో దూకింది. ఈ ఘటన ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటు చేసుకుంది.

కాలువ
కాలువ

By

Published : Aug 4, 2022, 6:57 PM IST

Tenth Class Student Suicide: ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఎతిశ.. పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్​ అయింది. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. ఈసారీ గణితం పరీక్ష తప్పింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఎతిశ.. తమ్ముడు హరితో కలిసి హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. కాళ్లకు ఉన్న పట్టీలు, చెవి కమ్ములు సోదరుడికి ఇచ్చి కాలువలోకి దూకింది.

తాను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని తమ్ముడు రోదిస్తూ తెలిపాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాలువ వెంబడి గాలించినా.. ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details