పిల్లలపై మొబైల్స్ ప్రభావం ఎంతగా పడింది అంటే.. అవి లేకుండా ఉండలేనంతగా. ఫోన్లోని గేమ్స్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. బంగారు లాంటి భవిష్యత్తును పక్కనపెట్టి... సెల్‌ఫోన్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు మొదట్లో పట్టించుకోకుండా.. వారు పూర్తిగా మొబైల్స్‌కి అలవాటు అయ్యాక స్పృహలోకి వస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది.
Student suicide: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
11:20 October 04
ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫోన్‌లో ఆటలు ఆడొద్దన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. మీర్‌పేట్ పరిధిలోని సర్వోదయనగర్ కాలనీలో మనోహర చారి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. చారికి ముగ్గురు సంతానం. వారిలో మొదటి కుమార్తె కౌశికి(17) ఇంటర్ చదవుతోంది. మొబైల్స్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడుతోందని తండ్రి మందలించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గం మధ్యలోనే మృతి చెందింది. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేపట్టారు.
తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్స్ ఇచ్చినా... ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్నా ఓ కంట కనిపెట్టడమే మంచిది. పూర్తిగా సెల్‌ఫోన్స్‌కి అలవాటుకాక ముందే... వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
ఇదీ చూడండి:Hot mail cyber crime: హాట్ మెయిల్ మెసేజ్‌తో ఎర.. రూ.25 లక్షలు హుష్ కాకి
Farmers suicide: పంట దక్కక.. అప్పు తీర్చలేక.. ఇద్దరు రైతులు బలవన్మరణం