మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో శానిటైజర్ సేవించింది.
శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - మంచిర్యాల నేర వార్తలు
తల్లిద్రండ్రులు మందలించారని మనస్తాపంతో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాలిక... గిరిజన ఆశ్రమ పాఠశాలలో శానిటైజర్ సేవించి బలవన్మరణానికి యత్నించింది.
కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాలిక... బోనాల జాతర కోసం నాలుగురోజుల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లింది. తిరిగి మంగళవారం మధ్యాహ్నం భోజన సమయానికి పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలికను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాలిక తెలిపింది.
ఇదీ చూడండి:అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం