తెలంగాణ

telangana

ETV Bharat / crime

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత.. ఎందుకంటే.. - తెలంగాణ వార్తలు

Tension at Singareni Colony : సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. ఇంటి స్థలం వివాదంలో నిన్న పెట్రోల్‌ పోసుకున్న అనిల్‌ అనే యువకుడు... ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు ఆగ్రహంతో... కొందరి ఇళ్లపై రాళ్లు విసిరారు.

Tension at Singareni Colony , singareni colony land issue
సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత

By

Published : Feb 14, 2022, 4:22 PM IST

Tension at Singareni Colony : హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత తలెత్తింది. గుడిసెల స్థలాల విషయంలో మనస్థాపానికి గురైన అనిల్‌ అనే యువకుడు నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడి బంధువులు ఆగ్రహంతో... కొందరి ఇళ్లపై రాళ్లు విసిరారు. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు.. సింగరేణికాలనీలో ముందు జాగ్రత్తగా బలగాలను మోహరించారు.

అంబేడ్కర్ భవనం కోసం కేటాయించిన స్థలం పక్కనే ఓ మహిళ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని కాలనీవాసులు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన తల్లిపై ఫిర్యాదు చేసి... కేసు నమోదు చేయించారని మనస్థాపంతో మహిళ కుమారుడు అనిల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.

ఇదీ చదవండి:ఉపాధ్యాయురాలి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

ABOUT THE AUTHOR

...view details