నాగర్‌కర్నూల్ జిల్లా జట్రపోలు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోగా... మృతదేహాన్ని తరలిస్తుంటే... కుటుంబసభ్యులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొల్లాపూర్‌కు చెందిన ఆంజనేయులు ఉదయం బస్సు కింద పడి మృతి చెందాడు. బస్సు తగిలి చనిపోయాడని ఆరోపిస్తూ... మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఆర్టీసీ అద్దె బస్సు కింద పడి వ్యక్తి మృతి.. పోలీసులు, బంధువుల మధ్య ఘర్షణ
ఆర్టీసీ అద్దె బస్సు కింద పడి ఆంజనేయులు మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం కొల్లాపూర్‌కు మృతదేహం తరలిస్తుండగా పోలీసులు, బంధువుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా జట్రపోలు వద్ద చోటుచేసుకుంది.
tension-in-nagar-kurnool-district
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని.... కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాక్టరును అడ్డుకోవడంతో పోలీసులు అందరిని చెదరగొట్టారు. పోలీసులపైకి రాళ్లు విసిరటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదీ చూడండి:పోలీసులు చెప్పినా వినలేదు.. వరదలో గల్లంతై వ్యక్తి మృతి...