ZPTC MEMBER MALLESHAM MURDER CASE సంచలనంగా మారిన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం మృతిని.. పోలీసులు హత్యగా తేల్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన హత్యకు నిరసనగా ఆయన గ్రామం గుర్జకుంటలో ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచి సత్తయ్య ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. సత్తయ్య ఇంటిపై జడ్పీటీసీ మల్లేశం బంధువులు దాడి చేసి కారు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించి పరిస్థితిని చక్కదిద్దారు.
జడ్పీటీసీ హత్య.. ఉపసర్పంచ్ ఇంటిపై దాడి
ZPTC MEMBER MALLESHAM MURDER CASE సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్యకు నిరసనగా ఆయన గ్రామం గుర్జకుంటలో ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచి సత్తయ్య ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు.
జడ్పీటీసీ హత్య.. ఉపసర్పంచ్ ఇంటిపై దాడి
ఇక మల్లేశం స్వగ్రామం గురిజకుంట ఉప సర్పంచ్ సత్యనారాయణతో గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిని, అతని ముఖ్య అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించగా.. నేరం అంగీకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దాచిన వివరాలు సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 27, 2022, 3:54 PM IST