తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tension at Kallur Police Station: కల్లూరు పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​ - అన్నమయ్య జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Tension at Kallur Police Station: ఏపీలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతలు సోమవారం చేసిన దాడిని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనల్లో పాల్గొన్న తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు.

కల్లూరు పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
కల్లూరు పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

By

Published : Apr 5, 2022, 1:08 PM IST

Tension at Kallur Police Station: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కల్లూరులో పోలీస్​స్టేషన్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. సదుం మండలం బూరగమందకు చెందిన తెదేపా కార్యకర్త రాజారెడ్డిపై.. వైకాపా కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ నేడు నిరసనలకు తెదేపా పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో రాజంపేట తెదేపా నేత శ్రీనివాసులరెడ్డి, పుంగనూరు ఇన్‌ఛార్జి చెల్లబాబు, నరసింహ యాదవ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కల్లూరు పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

నిరసనల్లో భాగంగా కల్లూరు పోలీస్​స్టేషన్​కు బయలుదేరుతుండగా.. నగరిపల్లిలో తెదేపా నేత నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్లారి కిశోర్‌ గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ.. నగరిపల్లిలో తెదేపా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే పోలీసులు తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్​ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కల్లూరు పీఎస్​ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: 'భూ సేకరణ చేయకుంటే నాదీ పురుగుల మందు తాగాల్సిన పరిస్థితే'

ABOUT THE AUTHOR

...view details