ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితులు చేజారినట్లు కనిపించడంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఉరుసు ఉత్సవాల నిర్వహణపై తీవ్ర ఘర్షణ.. ఇద్దరు మృతి - telangana crime news
16:04 October 27
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి
గుండాల గ్రామంలో ఏటా నిర్వహించే ఉరుసు ఉత్సవాలను బుధవారం రాత్రి నిర్వహించేందుకు గ్రామానికి చెందిన ముల్తానీ తెగకు చెందిన ఓ వర్గం ఏర్పాట్లు చేసింది. కానీ ఉత్సవాలతో గొడవలు జరుగుతున్నాయని గ్రామంలోని అదే తెగకు చెందిన మరో వర్గం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా అంతర్గతంగా కొన్ని రోజులుగా విభేదాలు జరుగుతుండగా బుధవారం ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో గొడవలు మొదలై ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్ణణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా మారింది. వీరిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా బలగాలను మోహరించారు. ఎస్పీ రాజేష్ చంద్ర గుండాల గ్రామానికి చేరుకొని పరిస్థితిపై సమీక్షించారు.
ఇదీచూడండి:son attack on father: కన్నతండ్రిపై కత్తితో దాడి... కారణం అదేనా..?