డివైడర్‌ను తప్పించబోయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి స్వల్వగాయాలు కాగా మిగిలిన ప్రయాణికులు సురక్షింతంగా బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా....... పదిమందికి స్వల్ప గాయాలు - కోదాడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడిన ఘటనలో పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద డివైడర్‌ను తప్పించబోయిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కోదాడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు కోదాడ సీఐ నరసింహరావు తెలిపారు. ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.