తెలంగాణ

telangana

ETV Bharat / crime

Kompally Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్.. డివైడర్​ను ఢీకొట్టి కారు బోల్తా - car hits a divider in kompally

Kompally Road Accident : మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ నుంచి హైదరాబాద్​ వస్తోన్న కారు మేడ్చల్ జిల్లా కొంపల్లి బిగ్​బజార్ వద్ద డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి.. కారులో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Kompally Road Accident, కొంపల్లి వద్ద కారు బోల్తా
Kompally Road Accident

By

Published : Dec 13, 2021, 8:56 AM IST

Kompally Road Accident : మద్యం మత్తులో వాహనం నడుపుతూ వారి ప్రాణాలు తీసుకోవడమేగాక.. ఎదుటి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ఎంత హెచ్చరించినా.. కఠిన చర్యలు తీసుకున్నా మందుబాబుల తీరు మారడం లేదు. గత మూడ్రోజుల్లోనే హైదరాబాద్​లో మద్యం మత్తులో దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు.

కొంపల్లి వద్ద కారు బోల్తా

Road Accident Hyderabad Today : హైదరాబాద్​ పేట్​బషీరాబాద్​ పరిధిలోని కొంపల్లి బిగ్​బజార్​ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ నుంచి నగరానికి వస్తున్న కారు మేడ్చల్ జిల్లా కొంపల్లి బిగ్​బజార్ వద్ద డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులు సాయిశ్రీనివాస్, పండిత్, పవన్​లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. కారులో నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details