RTC Bus Accident : ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు దుర్మరణం - తెలంగాణ వార్తలు

10:36 December 05
ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం
RTC Bus Accident : ఆర్టీసీ బస్సు- కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోరుట్లలోని బిలాల్‌పుర ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లి కారులో తిరుగు పయనమ్యారు. కోరుట్ల 10 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా వస్తూ... ఢీకొన్నాయి.
ఘటనలో కారు డ్రైవర్ సాజిద్ అలీ(45), ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
ఇదీ చదవండి:fake job racket busted : పంచాయతీరాజ్ శాఖలో కొలువులంటూ ఘరానా మోసం