3 persons drowned in Sagar canal: సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు! - sagar canal LATEST NEWS
07:33 December 07
కట్టకూరు వద్ద సాగర్ కాల్వలో గాలింపు
Missing in Sagar Canal : పొట్టకూటి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వారు అదృశ్యమైపోయారు. తమ వారు ఏమయ్యారో తెలియక.. బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వరికోత కోసం పంజాబ్ వాసులు ముదిగొండ మండలంలోని కట్టంకూరుకు వచ్చారు. వారిలో ముగ్గురు సోమవారం సాయంత్రం కట్టంకూరులోని సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి వారు వెనుదిరిగి రాలేదు.
తమ వారు రాత్రి నుంచి కనిపించట్లేదని.. పంజాబ్ వాసులు స్థానికులకు తెలిపారు. అందరూ గాలిస్తుండగా.. సాగర్ కాల్వ వద్దకు వెళ్లిన వారి సెల్ఫోన్లు, చెప్పులు కనిపించాయి. కాల్వ గట్టు మీద వీటిని ఉంచి.. వారు నీటిలోకి వెళ్లి గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉంటారని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైనట్లు అనుమానిస్తున్న వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి:
- నలుగురు మహిళలు గల్లంతు:ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన నలుగురు మహిళలు వాగులో గల్లంతయ్యారు. గురువారం రాత్రి 8.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బలిజపల్లి-టేకుమంద వద్దకు రాగానే కాజ్వేపై వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆటోను నిలిపేసి డ్రైవర్ వెళ్లిపోయాడు.
- ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు:కార్తికమాసం.. అదీ సోమవారం.. కుటుంబ సభ్యులతో కలిసి ఒకేఊరుకి చెందిన ముగ్గురు యువకులు కృష్ణా నది తీరానికి వచ్చారు. కుటుంబ సభ్యులంతా స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తుండగా.. వీరు ముగ్గురు కూడా పుణ్యస్నానం కోసం నదిలో దిగారు. ఇంకాస్త ముందుకు వెళ్తే మజా వస్తుందని అనుకున్నారు. ఒకరి వెంట ఒకరు.. ముగ్గురు ఇంకొంచెం ముందుకు వెళ్లారు.