Sexual Harassment : మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే కొందరు అధికారులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్‌లో ఓ అధికారి ఏకంగా శిక్షణకు వచ్చిన మహిళా ఎస్సైని వేధింపులకు గురిచేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు ఎస్సైపై పలు ఆరోపణలు రావడంతో సీపీ కార్తికేయ విచారణకు ఆదేశించారు. డీసీపీ అరవింద్‌బాబు నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అనేక విషయాలు బయటపడ్డాయి.
Sexual Harassment on Trainee SI : మద్యం దుకాణాల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకొంటున్న వ్యవహారాన్ని పలువురు విచారణ అధికారికి చెప్పినట్లు తెలిసింది. స్థానిక రియల్ వ్యాపారులతో కలిసి మూడు గ్రామాల్లో వెంచర్ల వ్యాపారం మొదలు పెట్టినట్లు, దీపావళి సందర్భంగా ఓ గ్రామంలో జూదరులతో కలిసి పేకాట ఆడినట్లు తేలింది. భార్యాభర్తల తగాదాల విషయంలో ఠాణాకు వచ్చే మహిళలతో ఒంటరిగానే గంటల తరబడి విచారణల పేరిట కాలయాపన చేసేవారని సిబ్బంది చెప్పుకొచ్చారు.
Sexual Harassment on Women Police : వేటు వేస్తారా? తప్పిస్తారా? : ఎస్సై వ్యవహారశైలి, ఇతనికి సహకరిస్తున్న ఉన్నతాధికారి తీరుపై తాజాగా నిఘా వర్గాలు విచారణ చేపట్టాయి. దీనికితోడు ఎస్‌బీ, డీసీపీ విచారణ ముగిసింది. పోలీసు శాఖకు చెడ్డపేరు రాకముందే వీరిపై చర్యలు తీసుకొంటారని తెలుస్తోంది.