శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత - smuggling at samshabad
11:20 January 10
Seizure of Gold: రూ.47.55 లక్షల విలువైన 970 గ్రాముల బంగారం స్వాధీనం
Seizure of Gold: శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యం బంగారం స్మగ్లింగ్ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. ఏదో రకంగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చాడు. అతని వద్ద తనిఖీ చేయగా... రూ.47.55 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు.
బంగారాన్ని పేస్ట్ రూపంలో చేసి.. మోకాలు కింది భాగంలో అతికించుకుని.. తరలించేందుకు వ్యక్తి యత్నించాడు. 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం పేస్టు చేసి.. అతికించుకున్నట్లు గుర్తించారు. దీనివిలువ రూ.47.55 లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ సిబ్బంది వెల్లడించారు.
ఇదీ చూడండి:విమానంలో సీటు కింద 24 బంగారు బిస్కెట్లు- పక్కా ప్లాన్‌తో...