తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja Smuggling through RTC bus: ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు

Ganja Smuggling through RTC bus : రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వరుసగా గంజాయి ముఠాల గుట్టు రట్టు చేస్తున్న పోలీసులు... మరో అంతర్రాష్ట్ర గ్యాంగ్​ను పట్టుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి.. మత్తు పదార్థాలను సీజ్ చేశారు.

Ganja Smuggling through RTC bus, ganjayi smuggling
ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా

By

Published : Dec 13, 2021, 11:43 AM IST

Ganja Smuggling through RTC bus: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుంటున్నారు. ట్రావెల్‌ బ్యాగుల్లో గంజాయిని పెట్టి బస్సులో ప్రయాణికుల్లా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్‌ జిల్లా రాయపర్తి వద్ద టాస్క్​ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.

ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా

పక్కాసమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు... ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 64కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు రూ.6.4లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా
  • కుకీస్​లో గంజాయి...

Ganja smuggling in visakha: గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటుంటే... అక్రమార్కులు మాత్రం రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏపీలోని విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి వద్ద ముందస్తు సమాచారం మేరకు ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బొడ్డు ఆదిత్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా... గంజాయితో తయారు చేసిన 17 కుక్కీలు దొరికాయి. దీంతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోయారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి

గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి(ganja smuggling news) మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్​ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ​ ద్వారా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. శనివారం 20 కేజీల పార్సిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు(ganja smuggling in india). దీనిపై కరివేపాకు అని రాసి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి కల్లు అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా.. గంజాయి రాకెట్ గుట్టు రట్టయిందన్నారు. అతడు రూ.1.1కోట్ల లావాదేవీలు జరిపినట్లు తెలిసిందని వెల్లడించారు. గోవింద్ దాబాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాబా నిర్వాహకుడిని కూడా అరెస్టు చేశారు. అతడే గంజాయి పార్సిళ్లను రిసీవ్ చేసుకునే వాడని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోనూ ముకేశ్ జైశ్వాల్​ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు(ganja smuggling visakhapatnam). పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేపల లారీల్లో గంజాయి..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి గుప్పుమంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో, ఖమ్మం గ్రామీణ పరిధిలో కలిపి మొత్తం రూ.9.28 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పట్టణంలోని విద్యానగర్​ కాలనీ వద్ద పోలీసులు వాహనతనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా రెండు చేపల లారీలు వచ్చాయి. వాటిపై పోలీసులకు అనుమానం రాగా... వెంటనే తనిఖీ చేశారు. లారీల నిండా చేపల పెట్టెలే ఉన్నాయి. కొన్నింటిని పరిశీలించగా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నమ్మకం కుదరని పోలీసులు మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అసలు సరుకు బయటపడింది. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:మరో పాటతో వచ్చిన సీఐ నాగమల్లు.. ఈసారి మత్తు వదలగొట్టేందుకు..

ABOUT THE AUTHOR

...view details