తెలంగాణ

telangana

ETV Bharat / crime

Shilpa Chowdary Custody Update : శిల్పాచౌదరిని మరో 5 రోజులు కస్టడీ కోరిన పోలీసులు - Shilpa Chowdary cheating case

Shilpa Chowdary Custody Update : పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆభియోగాలు ఎదుర్కొంటున్న గండిపేటకు చెందిన శిల్పాచౌదరిని మరో ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సోమవారం ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని విచారించారు. విచారణలో సేకరించిన సమాచారం, నిందితుల కాల్‌డేటా ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు.

Shilpa Chowdary, Shilpa Chowdary case, Shilpa Chowdary custody, శిల్పాచౌదరి, శిల్పాచౌదరి కేస్ అప్​డేట్స్
శిల్పాచౌదరి కస్టడీ

By

Published : Dec 7, 2021, 8:59 AM IST

Shilpa Chowdary Custody Update: ఆర్థిక మోసం ఆరోపణలతో అరైస్టైన శిల్పాచౌదరిని మరో 5 రోజులు కస్టడీకి కోరుతూ ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఇప్పటికే రెండు రోజులు ఆమెను ప్రశ్నించినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడం వల్ల మరోసారి కస్టడీ కోరారు.

Shilpa Chowdary Cheating Case : కస్టడీలో సేకరించిన సమాచారం, నిందితుల కాల్‌డేటా ఆధారంగా.. పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా సూచించారు. శిల్పాచౌదరి తాను సేకరించిన సొమ్మును ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చినట్లు.. పోలీసులకు చెప్పారు. రాధిక అనే మహిళకు రూ.6 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అయితే ఇదంతా అసత్యమంటూ..రాధిక అనే రియల్‌ ఎస్టేట్ వ్యాపారి, ఈవెంట్‌ నిర్వాహకురాలు.. పోలీసులను ఆశ్రయించారు. తానే స్వయంగా వచ్చి వివరాలు ఇస్తానంటూ పేర్కొన్నారు. బాధితులు, నోటీసులు పంపిన వారు.. ముఖం చాటేయడంతో.. మరోసారి వారికి నోటీసులు జారీచేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Shilpa Chowdary Case News : శిల్పాచౌదరి మోసం చేసిన ప్రముఖుల్లో హీరో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఉన్నారు. ఆమె నార్సింగి పోలీసులకు శిల్పాపై ఫిర్యాదు చేశారు. ప్రియదర్శిని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు..

Shilpa Chowdary Case Update : అధిక వడ్డీ పేరుతో పలువురిని మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన శిల్పా చౌదరి పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి ఆమెను కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. మొదటి రోజు ఆమె ఆర్ధిక లావాదేవీలపై సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను ఆమె ముందు ఉంచి విచారణ జరిపారు. ఇప్పటి వరకూ ఎంత మంది నుంచి డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బును ఏం చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరో వైపు ఆమె భర్తకు మొదటి కేసులో మాత్రమే బెయిల్ రాగా.. నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Shilpa Chowdary Police Custody News : అమాయకులకు మాయమాటలు చెప్పి వారి నుంచి కోట్ల రూపాయలు దోచేసిన శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన వారిలో 90 మంది సెలబ్రిటీ కుటుంబాల మహిళలున్నారని పోలీసులు గుర్తించారు. శిల్ప తన వద్ద నుంచి రూ.2 కోట్లకుపైగా డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ హీరో మహేశ్​బాబు సోదరి ప్రియదర్శిని తమకు ఫిర్యాదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్​స్టేషన్​లో మరో ఫిర్యాదు నమోదైంది. కథానాయకుడు హర్ష.. శిల్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి సినిమాలో హీరోగా హర్ష నటించారు. రూ.3 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రాన్ని శిల్ప నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికేనార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీతీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details