తెలంగాణ

telangana

ETV Bharat / crime

Newly married woman suicide Anantapur: పుట్టింటిని మరవలేక.. అత్తారింటికి వెళ్లలేక.. నవవధువు ఆత్మహత్య - telangana news

Newly married woman suicide Anantapur: ఉన్నత చదువులు చదివి... ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న బిడ్డకు వైభవంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. తమ బాధ్యత తీరిందని ఆనందబాష్పాలతోనే అత్తింటికి సాగనంపారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. బాజాభజంత్రీలు మోగిన ఆ ఇంట్లో... ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కట్టుకున్నవాడితో అత్తింటికి వెళ్లాల్సిన ఆడబిడ్డ... పుట్టింటిని వీడలేక తనువుచాలించింది. పుట్టిపెరిగిన ఇంటిని వదిలేసి... మెట్టినింటికి వెళ్లలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

New wed woman suicide, Newly married woman suicide Anantapur
నవవధువు ఆత్మహత్య

By

Published : Dec 1, 2021, 12:05 PM IST

Newly married woman suicide Anantapur : ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుట్టింటిని వదిలి... అత్తింటికి వెళ్లలేక ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాకేంద్రానికి చెందిన సూర్యనారాయణకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కష్టపడి ముగ్గరు పిల్లలకు ఉన్నత చదువులు చదివించారు. అందులో మొదటి కుమార్తెకు రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కష్టపడి చదివించినందుకు కూతురుకు ఉద్యోగం రావడంతో.. చాలా మురిసిపోయారు. కుమార్తె చదువైపోవడం.. ఉద్యోగం కూడా రావడంతో.. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఘనంగా పెళ్లి చేశారు. అదే ఆయన కుమార్తె పాలిట శాపమైంది. పెళ్లయిన కుమార్తె.. తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక బెంగతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదివిన కుమార్తె ఉరి వేసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏం జరిగింది?

Newly wed woman suicide: నగరానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వీరిలో సుజన(26) మొదటి సంతానం. బీటెక్‌ పూర్తి చేసి, 2019లో గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించింది. బుక్కరాయసముద్రంలోని గ్రామ సచివాలయం-2లో పనిచేస్తోంది. గత నెల 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు విశ్వనాథ్‌తో వివాహమైంది.

పుట్టింట్లో పది రోజులు..

Anantapur newly bride suicide: పది రోజుల పాటు సెలవు పెట్టి పుటింట్లో ఉంది. తిరిగి సోమవారం విధులకు హాజరైంది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన సుజన రాత్రి ఇంట్లోని స్నానాల గదిలో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. వారం రోజులుగా అత్త వారింటికి ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చింది. తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లాలని సూచించారు. వారిని వదిలి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతో సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనంత గ్రామీణం సీఐ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:groom Road accident: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. నవవరుడిని కబళించిన మృత్యువు!

ABOUT THE AUTHOR

...view details