తెలంగాణ

telangana

ETV Bharat / crime

Mother Killed a Baby Girl : ఆడపిల్ల పుట్టిందని అమ్మే చంపేసింది - Mother Killed her daughter

Mother Killed a Baby Girl : భూమ్మీదకొచ్చి రెండు రోజులైనా కాలేదు. ఆ పసికందుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. ఆడబిడ్డ పుట్టిందని... ఓ తల్లి.. నవమాసాలు కడుపులో మోసిన కన్నబిడ్డను కనికరం లేకుండా కాటికి పంపింది. ఆపై.. ఏమీ ఎరగనట్టు ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లకు అనుమానం రావడంతో నిలదీయగా అసలు కథ బయటపడింది.

Mother Killed a Baby Girl, పసిపాపను చంపిన తల్లి
ఆడపిల్ల పుట్టిందని తల్లే చంపేసింది

By

Published : Dec 9, 2021, 9:57 AM IST

Mother Killed a Baby Girl : ఆడపిల్లకు నేటి సమాజంలోనే కాదు.. కన్నతల్లి వద్ద కూడా భద్రత లేకుండా పోయింది. అమ్మాయి పుడితే ఇంట్లో మహాలక్ష్మి కాలుపెట్టినట్లు భావించే సంస్కృతి మనది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆడబిడ్డలను కనడానికే భయపడుతున్నారు. అమ్మాయి పుట్టిందంటే.. తలపై ఏదో భారం పడినట్లు భావిస్తున్నారు. కొందరైతే వాళ్లను అడ్డుతొలగించుకుంటున్నారు. పసికందని కూడా చూడకుండా దారుణంగా కడతేరుస్తున్నారు. సాధారణంగా ఇలాంటి దారుణ పనులను పుట్టిన బిడ్డ తండ్రో... లేక నానమ్మ, తాతలు చేస్తారు. కానీ ఏపీలోని గుంటూరు జిల్లాలో మాత్రం నవమాసాలు కడుపులో పెట్టుకుని చూసుకున్న కన్నతల్లే రెండ్రోజుల పసిపాపను హతమార్చింది.

Mother Killed Her Daughter : గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణం జరిగింది. కన్నతల్లే రెండు రోజుల పసిపాపను చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని తల్లి బొంత లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. లక్ష్మి దంపతులకు గతంలోనే అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో రెండు రోజుల పసిపాపను చంపేసి.. ఏమీ తెలియనట్లు ఆస్పత్రికి తీసుకొచ్చింది. వైద్య సిబ్బందికి అనుమానం వచ్చి నిలదీయడంతో ఈ ఘాతుకం వెలుగుచూసింది. వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details