Cyber Criminals Trap Kamareddy deputy MRO: కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. పాన్‌కార్డ్ అప్‌డేటేషన్ చేసుకోవాలంటూ... ఉప తహసీల్దార్‌కు టోకరా వేశారు. ఎస్బీఐకి సంబంధించి పాన్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోవాలని... లేదంటే 'యోనోయాప్' పనిచేయదంటూ ఉప తహసీల్దార్ రంజిత్‌కు మెయిల్‌కు లింక్ పంపారు. దీనిని తెరిచిన క్రమంలోనే.... 5 విడతల్లో 3 లక్షల 40 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
Cyber Criminals Trap Deputy MRO: డిప్యూటీ తహసీల్దార్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా... రూ3.40 లక్షలు మాయం - Cyber crime
Cyber Criminals Trap Kamareddy deputy MRO: అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజుకో కొత్త పంథా అనుసరిస్తూ.. అవతలి వ్యక్తికి అనుమానం రాకుండా వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. తాజాగా కామారెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌కు టోకరా వేశారు.
సైబర్ నేరగాళ్లు
బాధితుడు అప్రమత్తమై ఆపే ప్రయత్నం చేసినా.... అప్పటికే ఖాతా నుంచి డబ్బులు మాయమైపోయాయి. రంజిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగాళ్లు పన్నుతారని... వారి ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు కోరుతున్నారు. తెలియని లింకులు ఏవైనా వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Cyber Crime Today : సైబర్ కేటుగాళ్ల నయా పంథా.. అద్దె ఇళ్ల నుంచే మోసాలు