తెలంగాణ

telangana

ETV Bharat / crime

Honor Killing News : కులాంతర వివాహం చేసుకుంటుందని.. కుమార్తెను చంపిన తల్లి - honor killing news

Honor Killing News : నవమాసాలు కడుపులో పెట్టుకుని చూసుకున్న తల్లి... బిడ్డ భూమ్మీదకు రాగానే తన కంటిపాపలా కాపాడుకుంటుంది. ఆ బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది. ఏం కావాలన్నా చేసిపెడుతుంది. ఏదడిగినా ఇచ్చేస్తుంది. అలాంటి మమతకు మారుపేరైన కన్నతల్లి.. వేరే కులం వాడిని ప్రేమించిందన్న కారణంతో అపురూపంగా.. తన ఆరోప్రాణంగా చూసుకున్న కుమార్తెను మట్టుబెట్టింది. తన తల్లితో కలిసి కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించింది.

Honor Killing News, Honor Killing Latest News, Warangal Honor Killing News, పర్వతగిరి పరువు హత్య, వరంగల్ పరువు హత్య
పర్వతగిరి పరువు హత్య

By

Published : Dec 4, 2021, 8:20 AM IST

Honor Killing News : కాలం మారుతోంది. ఆలోచనలు మారుతున్నాయి. కానీ కొందరు మాత్రం ఇంకా పాతయుగంలోనే బతుకుతున్నారు. కట్టుబాట్లు, పరువు పేరుతో కన్నబిడ్డలను కాటికి పంపుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పిల్లల ఉసురు తీస్తున్నారు. ఓ ప్రణయ్.. ఓ హేమంత్.. ఇప్పుడు అంజలి. ఇలా పరువు హత్యలకు యువత బలవుతూనే ఉంది. తమకు ఇష్టం లేని వాళ్లని ప్రేమించారనో.. వేరే కులం వాళ్లని పెళ్లి చేసుకుంటున్నారనో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారనో.. కారణమేదైనా.. తమ పరువుకు భంగం వాటిల్లుతోందని తెలియగానే.. తల్లిదండ్రులు.. తాము అపూరపంగా.. ఆరోప్రాణంగా చూసుకున్న కన్నబిడ్డలను కర్కశంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు పరువు హత్యల్లో పిల్లలను హతమార్చిన ఘటనల్లో హంతకులు తండ్రులనే చూశాం. కానీ ఈ ఘటనలో తన తల్లితో కలిసి కుమార్తెను హత్య చేసింది ఓ కన్నతల్లి.

Warangal Honor Killing News : కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లి.. బిడ్డను హతమార్చిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం జరిపించిన అనంతరం భర్త చనిపోవడంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తోంది. పదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అంజలి(17).. ఇదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తెను పలుమార్లు మందలించింది.

Parvathagiri honor killing : అయినా మార్పు రాకపోవడంతో పెళ్లి చేసుకుంటే తన పరువుపోతుందని భావించిన సమ్మక్క తన తల్లి నాము యాకమ్మతో కలిసి గత నెల 19న అర్ధరాత్రి అంజలి గాఢనిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమ్మక్క, యాకమ్మలను విచారించగా కులాంతర వివాహం చేసేందుకు ఇష్టం లేకనే హత్య చేశామని ఒప్పుకున్నారు.

ఇవీ చదవండి :

Honor Killing Latest News : తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని.. కన్న కూతురిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు. మరోవైపు.. కట్టుకున్న భార్యను గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ రెండు ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో జరిగాయి. హరియాణాలో జరిగిన మరో ఘటనలో ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతిని పిస్తోలుతో కాల్చి చంపాడు ఓ కిరాతకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో జరిగింది. గ్రామంలో ఓ యువతిని ధనశేఖర్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ధనశేఖర్‌ను యువతి తండ్రి బాబు దారుణంగా హతమార్చాడు. బాబు పొలంలోనే ధనశేఖర్ మృతదేహం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details