తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hyderabad Gang Rape: హైదరాబాద్​లో బాలికపై గ్యాంగ్ రేప్ - telangana news

సుల్తాన్​బజార్​లో బాలికపై గ్యాంగ్ రేప్
సుల్తాన్​బజార్​లో బాలికపై గ్యాంగ్ రేప్

By

Published : Dec 7, 2021, 12:18 PM IST

Updated : Dec 7, 2021, 2:30 PM IST

12:08 December 07

Sultan Bazar Gang Rape: సుల్తాన్​బజార్​లో బాలికపై గ్యాంగ్ రేప్

Sultan Bazar Gang Rape: హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో స్పష్టత రావాల్సి ఉంది.

"మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అనంతరం ఆమె కోసం గాలింపు మొదలుపెట్టాం. బాలికను ట్రేస్​ అవుట్ చేసి విచారణ జరిపాం. విచారణలో.. బాలిక తన ఇష్టపూర్వకంగా బాయ్​ఫ్రెండ్​తో వెళ్లినట్లు ఒప్పుకుంది. మరోవైపు డిప్రెషన్​లో ఉన్న తమ కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం రాచకొండ కమిషనరేట్​లోని ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. హైదరాబాద్​లో జరగలేదు. కేసు ఇంకా విచారణలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది."

- భిక్షపతి, సుల్తాన్ బజార్ సీఐ

దేశంలో ఇటీవల ఆడవారిపై జరిగిన సామూహిక అత్యాచారాలు..

Vadodara NGO Gang Rape: ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కిరాతకులు. తీవ్రమనస్తాపం చెందిన బాధితురాలు రైల్వే కంపార్ట్​మెంట్​లో ఉరివేసుకుని బలవర్మణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

Uttar Pradesh Gang Rape: ఓ బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సహారన్​పుర్​ జిల్లాలో జరిగింది.

Gang rape victim: కళాశాలకు వెళుతున్న యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన ఎస్సైని సస్పెండ్​ చేశారు అధికారులు. ఈ ఘటన రాజస్థాన్​, భరత్​పుర్​ జిల్లాలో జరిగింది.

Last Updated : Dec 7, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details