తెలంగాణ

telangana

ETV Bharat / crime

Family suicide : వ్యాపారంలో నష్టాలు.. కలహాలతో.. కుటుంబం ఆత్మహత్య - Family suicide in sangareddy

కుటుంబం ఆత్మహత్య, family suicide
ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి

By

Published : Dec 3, 2021, 11:15 AM IST

Updated : Dec 3, 2021, 11:40 AM IST

11:12 December 03

Family suicide : సంగారెడ్డి జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

Family suicide : తన భార్యా పిల్లలకు మంచి భవిష్యత్​ ఇవ్వాలనుకున్నాడు ఆ వ్యక్తి. దానికోసం ఎంతైనా కష్టపడాలనుకున్నాడు. దానికోసం స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. కాస్త సంపాదించగానే.. మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. ఒక్కసారిగా నష్టాలు రావడం వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు ఆ దంపతుల మధ్య కలహాలు సృష్టించాయి. తరచూ గొడవలు రేపాయి. అలా భర్తతో గొడవపడిన భార్య పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వ్యాపారంలో నష్టాలు ఓవైపు.. కుటుంబ కలహాలు మరోవైపు అతణ్ని కుంగదీశాయి. భార్యాపిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణ వార్త విన్న భార్య.. పిల్లలను చెరువులో పడేసి తాను దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇలా వ్యాపారంలో నష్టాలు ఓ కుటుంబం ఉసురు తీశాయి.

Family suicide in Sangareddy : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ్యాపారంలో నష్టాలు.. కలహాలు.. ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. నలుగురు కుటుంబ సభ్యులను బలవన్మరణానికి పురిగొల్పాయి. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ బీహెచ్​ఈఎల్​లో స్థిరపడ్డారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి గొడవ పెద్దది కావడంతో భార్య లావణ్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

Family Suicide news Today : భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన చంద్రకాంత్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణించాడనే విషయం తెలిసిన లావణ్య ఇద్దరు పిల్లల్నిఆందోల్ పెద్ద చెరువులో పడేసి.. తానూ దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతుల్లో 8సంవత్సరాల ప్రథమ్‌, 3సంవత్సరాల సర్వజ్ఞ ఉన్నారు. కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో 8 ఏళ్ల ప్రథమ్, మూడేళ్ల సర్వజ్ఞ ఉన్నారు.

Last Updated : Dec 3, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details