తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder in dichpally: మెకానిక్​ షెడ్​లో ముగ్గురి దారుణ హత్య.. - three murdered in mechanic shed at dichpally

Murder in dichpally: బతుకుదెరువు కోసం పట్టణానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా మారారు. మెకానిక్​ షాప్​లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న ఆ ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలోని హార్వెస్టర్ మెకానిక్ షాప్​​లో ఈ ఘటన జరిగింది.

three died in dichpally
డిచ్​పల్లిలో ముగ్గురి హత్య

By

Published : Dec 8, 2021, 3:16 PM IST

Updated : Dec 8, 2021, 7:24 PM IST

Murder in dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ముగ్గురు మృత్యు ఒడికి చేరారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురిని హత్య చేశారు. డిచ్​పల్లి మండల కేంద్రంలో నాగపూర్ గేట్ సమీపంలో ఉన్న హార్వెస్టర్ మెకానిక్ షాపులో హార్పల్ సింగ్(45), జోగిందర్​ సింగ్, సునీల్(25) పనిచేస్తున్నారు. వీరంతా గత రాత్రి పని పూర్తి చేసుకుని షాపులోనే నిద్ర పోయారు. కొద్ది సేపటి తర్వాత నిద్రిస్తున్న ముగ్గురినీ.. గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

ప్రత్యేక బృందం

అటుగా వెళ్తున్న స్థానికులకు షాపులో రక్తం కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు. ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్​ కమిషనర్ కార్తికేయ, డీసీపీ అరవింద్ బాబు.. క్లూస్ టీం, డాగ్స్ స్కార్డ్స్​తో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్య కేసులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ కార్తికేయ వెల్లడించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. మృతులు హార్పల్ సింగ్, జోగిందర్ సింగ్ పంజాబ్​కు చెందిన వారుగా పేర్కొన్నారు. సునీల్ సంగారెడ్డి జిల్లా భోజ్యనాయక్ తండాకు చెందిన వ్యక్తి అని తెలిపారు.

ఇదీ చదవండి:Dead body in Water tank: వాటర్​ ట్యాంకులో మృతదేహం వివరాలు గుర్తింపు.. వాటి ఆధారంగా నిర్ధరణ

Last Updated : Dec 8, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details