తెలంగాణ

telangana

ETV Bharat / crime

Step father kills daughter: తనకు పుట్టలేదనే కారణంతో.. మారు తండ్రి కర్కశత్వం - step father kills daughter in medak district

తన రక్తం పంచుకుని పుట్టలేదనే కారణంతో అభం శుభం తెలియని చిన్నారిని కడ తేర్చాడు ఓ మారు తండ్రి. తనతో విడాకులు తీసుకున్న భార్య.. మళ్లీ తిరిగిరావడంతో ఆమెను చేరదీశాడు కానీ ఆమెకు పుట్టిన కూతురును చేరదీయలేకపోయాడు. అందుకే సమయం కోసం ఎదురుచూశాడు. కర్కశంగా ఆ పాపను గొంతు నులిమి చంపేశాడు. మెదక్​ జిల్లా పాల్వంచ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Step father kills daughter
మారు తండ్రి కర్కశత్వం

By

Published : Dec 1, 2021, 9:46 AM IST

Step father kills daughter: ఏడేళ్ల క్రితం వారిద్దరికి వివాహం జరిగింది. ఏడాదిన్నర పాటు సజావుగా కాపురం సాగింది. కానీ ఇంకా పిల్లలు కాలేదనే కారణంతో పెద్దల సమక్షంలో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె మరొకరిని వివాహం చేసుకుంది. రెండేళ్ల తర్వాత వారిద్దరికి పాప పుట్టింది. నాలుగేళ్లు బాగానే ఉన్నారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో.. రెండో భర్తను వదిలి.. మాజీ భర్త వద్దకు వచ్చింది. గతంలో ముడివేసుకున్న బంధం కారణంగా ఆమెనూ, ఆమెకు పుట్టిన పాపను మొదటి భర్త చేరదీశాడు. చిన్నారిని బాగా చూసుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న అతనిలో ఏదో ఆత్మన్యూనతా భావం ఏర్పడింది. తనతో రక్త సంబంధం లేని పాపను ఎలా ఆదరించాలి అనుకున్నాడు. పైకి ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే.. లోపల ద్వేషం పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసి చిన్నారి ఉసురు తీసుకున్నాడు.

tragedy in palvancha: మెదక్ జిల్లా టేక్మాల్​ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రితో 2014లో పెళ్లి జరిగింది. ఏడాదిన్నర అయినా పిల్లలు కలగకపోవడంతో పెద్దల సమక్షంలో 2016లో వారు విడిపోయారు. ఆ తర్వాత అదే ఏడాది సావిత్రి.. సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలం రోళ్లపాడుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కూతురు పుట్టింది. 2020 వరకు అతనితోనే కలిసి ఉన్న సావిత్రి గత ఎనిమిది నెలల క్రితం రెండేళ్ల వయసున్న తన కూతురు వర్షిణితో సహా మళ్లీ స్వగ్రామమైన పాల్వంచకు వచ్చింది. సావిత్రి, రమణయ్య పాపతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సావిత్రి గర్భం దాల్చింది.

నేను తీసుకువస్తానని

వైద్య పరీక్షల నిమిత్తం భార్యను, పాపను తీసుకుని రమణయ్య టెక్మాల్​ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. పరీక్షల అనంతరం పాల్వంచకు తిరిగి వెళ్తున్న క్రమంలో వర్షిణిని తాను తీసుకువస్తానని చెప్పి.. సావిత్రిని తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనం పైన ఎక్కి పంపించాడు. ఆ తర్వాత పాపతో కలిసి బయలుదేరాడు. పాల్వంచకు నాలుగు కి.మీల దూరంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పాప మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయిందని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఎంతసేపైనా లేవకపోయేసరికి.. అనుమానం వచ్చి చిన్నారి స్థితిని గమనించారు. గొంతు నులిమినట్లు గుర్తులు కనిపించడంతో పాప చనిపోయిందని గుర్తించిన కుటుంబీకులు రమణయ్యను నిలదీశారు. తానే హత్య చేసినట్లు రమణయ్య ఒప్పుకున్నాడు. ఇంట్లో జరుగుతున్న గొడవను గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వర్షిణి తనకు పుట్టలేదనే కారణంతోనే రమణయ్య హత్య చేసినట్లు సావిత్రి కుటుంబీకులు తెలిపారు.

ఇదీ చదవండి:Mee Seva Employee Murder case: కత్తులతో నరికి.. శరీరాన్ని 7 భాగాలు చేసి.. ఆపై

student suicide: ప్రేమ విఫలమై యువతిపై హత్యాయత్నం చేసిన యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details