తెలంగాణ

telangana

ETV Bharat / crime

car burnt in fire accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా కారులో మంటలు - అమ్మనబోలు వద్ద అగ్ని ప్రమాదం

car burnt in fire accident: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది.

car burnt
మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు

By

Published : Dec 2, 2021, 12:46 PM IST

car burnt in fire accident: ప్రయాణంలో ఉన్న కారు ఒక్కసారిగా మంటలంటుకుని దగ్ధమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం పరిధిలో చోటుచేసుకుంది. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన కుటుంబం... జనగామ జిల్లాలో వివాహ వేడుకకు హాజరై తిరిగి అమ్మనబోలుకు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారుకు చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది.

మంటల్లో పూర్తిగా దగ్ధమవుతున్న కారు

కారు ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై వాహనంలోంచి బయటికి పరుగులుతీశారు. వారు చూస్తుండగానే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

ABOUT THE AUTHOR

...view details