Father killed daughter news:భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడు ఓ దుర్మార్గపు తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో జరిగిన దారుణం ఇది. గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించింది. అప్పటి నుంచి సునీత, రాజశేఖర్ తరచూ గొడవపడుతుండేవారు.
Father killed daughter news: కరెంట్ షాక్ ఇచ్చి కన్న కూతురును చంపిన తండ్రి - siddipet district news
19:08 December 03
దంపతుల మధ్య ఘర్షణతో చిన్నారిని చంపిన తండ్రి
వేరు కాపురం వద్దని
ఈ క్రమంలో ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు పలు మార్లు పంచాయితీ పెట్టి కలిసుండాలని దంపతులకు నచ్చజెప్పారు. సునీత, అత్తమామలకు మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంటే వేరు కాపురం పెట్టాలని పెద్దలు సూచించారు. ఈ నేపథ్యంలో వేరు కాపురం పెడదామని సునీత కోరగా.. రాజశేఖర్ నిరాకరించడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి గొడవ జరగడంతో భార్య సునీతను కొట్టి పాపను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి విద్యుత్ షాకిచ్చి చంపేశాడు. పాప మృతి చెందిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అంతకు ముందుగా తన తోటి రైతుకు ఫోన్ చేసి ఇదే తన చివరి కాల్ అని తెలిపాడు. సమాచారం అందుకున్న రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:woman suicide : నూరేళ్ల జీవితం.. పెళ్లైన మూణ్నెళ్లకే ఆవిరి..!
TAGGED:
Father killed daughter news