Family missing in old city: నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం అయిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Family missing in old city: మిస్టరీ.. నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం - family missing in old city news
Family missing in old city: పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో మూడు రోజుల క్రితం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
దంపతులు షేక్ హాబీబ్, షమీమ్.. తమ నలుగురు పిల్లలతో కలిసి పటేల్ నగర్ బండ్లగూడ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నెల 16 న హాబీబ్ పనికి వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంట్లోకి అడుగుపెట్టిన తనకు.. భార్య షమీమ్, పిల్లలు కనిపించలేదు. షమీమ్, పిల్లలు హారున్(11), సోఫియా(9), ఫైజన్(7), ఆఫీయా(3).. ఇంట్లో కనిపించకపోయేసరికి.. తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినప్పటికీ వారి ఆచూకీ దొరకకపోవడంతో హబీబ్.. చంద్రయాన్ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో దంపతులు మృతి.. 2 రోజుల తర్వాత గుర్తింపు