Brother murdered in medchal: మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల జరిగిన ఘర్షణలో అన్న మృతి చెందగా.. తమ్ముడు పరారీలో ఉన్నాడు. ఈ నెల 24 న అర్ధరాత్రి.. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు భరత్, సాయితేజ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కుక్కర్‌తో భరత్‌పై సాయితేజ దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న పడి ఉన్న అన్నను చూసి తమ్ముడు అక్కడి నుంచి పారిపోయాడు.
Brother murdered in Medchal: మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. చివరకు.. - fighting between brothers
Brother murdered in medchal: మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. అన్న హత్యకు దారితీసింది. మేడ్చల్ జిల్లాలో ఈ నెల 24 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా తమ్ముడు పరారీలో ఉన్నాడు.
తమ్ముడి చేతిలో అన్న హత్య
తల్లి వరలక్ష్మి పక్షవాతంతో పడి ఉండటంతో వారిని ఆపలేకపోయింది. దీంతో సాయితేజ చేసిన దాడిలో భరత్ మృతి చెందాడు. మృతుడి స్నేహితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Costume designer suspicious death: కేపీహెచ్‌బీ నాలాలో కాస్ట్యూమ్ డిజైనర్ మృతదేహం...