Laknepally Road accident: వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృత్యువాతపడ్డారు. వివాహవేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట మండలం లక్నెపల్లి వద్దకు రాగానే.... వారి బైక్ను టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నా చెల్లెల్లు అక్కడిక్కడే చనిపోయారు.
పెళ్లికి వెళ్లి విగతజీవులుగా.. రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి - road accident at laknapally
Laknepally Road accident: పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో సరదాగా గడిపి ఇంటికి తిరుగుపయనమైన.. ఆ అన్నాచెల్లెలికి అదే ఆఖరి రోజైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి వారిని బలితీసుకుంది. వరంగల్ జిల్లా లక్నెపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదం
మృతులు ఖానాపురం మండలం దబీర్‌పేటకి చెందిన మొగుళ్లపల్లి రాకేశ్‌బాబు, ప్రసన్నగా స్థానిక పోలీసులు గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Uppal Accident CCTV footage: ఉప్పల్లో టిప్పర్ను ఓవర్ టేక్ చేయబోయి...
Last Updated : Dec 27, 2021, 8:21 AM IST