మంచు తుపాను బీభత్సం.. తెలుగు దంపతులు గల్లంతు.. భార్య మృతి - Two Telugu couple died in snow storm
17:27 December 27
అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. తెలుగు దంపతులు గల్లంతు.. భార్య మృతి
Two Telugu couple died in snow storm in America: అమెరికాలోని అరిజోనాలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి తెలుగు దంపతులు గల్లంతయ్యారు. భార్య హరిత మృతదేహం లభించగా.. భర్త నారాయణ మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
హరితకు సీపీఆర్ చేసి బతికించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదం అరిజోనా వద్ద గడ్డ కట్టిన సరస్సును దాటుతుండగా చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్‌లోనే ఈ దంపతులు స్వగ్రామమైన పాలపర్రుకు వచ్చి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఏపీకే చెందిన మరో వ్యక్తి సైతం గల్లంతయ్యాడు. అతని కోసం సిబ్బంది సహాయచర్యలు ప్రారంభించారు.
ఇవీ చదవండి: