తెలంగాణ

telangana

ETV Bharat / crime

Telugu Academy Case: అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

Telugu Academy Case
Telugu Academy Case

By

Published : Oct 6, 2021, 10:10 AM IST

Updated : Oct 6, 2021, 11:37 AM IST

10:06 October 06

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో (Telugu Academy Case) దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. మోసానికి పాల్పడిన ముగ్గురు బ్యాంక్‌ ఏజెంట్లు వెంకట్, రాజ్‌కుమార్, సాయిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్‌ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్‌ సొసైటీకి మళ్లించారు. కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లను మళ్లించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ వివరాలు వెల్లడించనున్నారు.  

నిందితుల కస్టడీపై ఇవాళ విచారణ

తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ .. నిధుల గోల్‌మాల్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిధులు బ్యాంకుల నుంచి మళ్లిస్తున్నా.. అకౌంట్స్‌ అధికారిగా మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని పోలీసులు రమేశ్​ను ప్రశ్నించినట్టు సమాచారం. కోర్టు అనుమతితో ఇవాళ్టి నుంచి యూబీఐ బ్యాంకు మేనేజర్‌ మస్తాన్‌వలీని పోలీసులు కస్టడీలో తీసుకొని నిధుల స్వాహా కేసులో లోతుగా విచారించనున్నారు. ఇతర నిందితుల పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.  

అసలు స్కాం ఏంటి..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu Academy Case).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.  

ఇలా వెలుగులోకి వచ్చింది..

ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి :Telugu Akademy Case: 'నిర్లక్ష్యమే కొంపముంచింది..' నిధుల గోల్​మాల్​పై సర్కార్​కు నివేదిక

Last Updated : Oct 6, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details