Fire Accident in Nederland: నెదర్లాండ్స్‌లో ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ హాదీ నెదర్లాండ్స్‌లోని ఆసిఫ్‌నగర్‌లో నివాసముంటున్నాడు. అతను ఉంటున్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
చికిత్స పొందుతూ మృతి
అగ్నిప్రమాదం కారణంలో భవనంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో అతను ఇంటి బయటకు రాలేక పోయాడు. కమ్ముకున్న పొగతో ఊపిరాడక అబ్దుల్ అస్వస్థతకు గురయ్యాడు. స్పృహ కోల్పోయిన అతనిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోర్చుగల్ దేశ సభ్యత్వం
మృతుడికి 2015 సంవత్సరంలో పోర్చుగల్ దేశ సభ్యత్వం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెకేషన్ కోసం నెదర్లాండ్స్‌కు వచ్చి.. అక్కడ భవనంలో అద్దెకు దిగారని వెల్లడించారు. రెండు రోజుల క్రితం అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. అప్పుడే దట్టమైన పొగ కారణంగా అబ్దుల్ స్పృహ కోల్పోయాడని.. అనంతరం చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడు అబ్దుల్ హాది మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చూడండి:పాల్వంచ ఘటనలో కొత్త ట్విస్ట్.. పోలీసుల ప్రకటనతో గందరగోళం..