తెలంగాణ

telangana

ETV Bharat / crime

Whitener Addicts in Telangana : మత్తు సరే.. మరి వైట్​నర్ మాటేమిటి?

రాష్ట్రంలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారికి శ్రమ కొంతవరకు ఫలించినట్లే కనిపిస్తోంది. పోలీసుల దాడులు పెరగడం వల్ల మత్తుప్రియులు వైట్​నర్​తో సరిపెట్టుకుంటున్నారు. గంజాయికి అడ్డుకట్ట వేస్తుంటే.. బాధితులు వైట్​నర్​వైపు మళ్లడంతో దానిపైనా దృష్టి సారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Whitener Addicts in Telangana
Whitener Addicts in Telangana

By

Published : Oct 28, 2021, 9:27 AM IST

రాష్ట్రవ్యాప్తంగా గంజాయిని(Marijuana) నిర్మూలించేందుకు పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌తో పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. పోలీసుల దాడులకు భయపడి గంజాయి వ్యాపారులు(Marijuana dealers) సరకు దాచిపెట్టడంతో.. మత్తుకు అలవాటు పడినవారు వైట్‌నర్‌(Whitener addicts)తో సరిపెట్టుకుంటున్నారు. గతంలో దీని వినియోగం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమవగా.. నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వేగంగా పెరిగాయి.

దాంతో వైట్‌నర్‌ అమ్మకాలను(Police focus to prevent whitener sales) ఎలా నియంత్రించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది నిషేధిత జాబితాలో లేకపోవడంతో విక్రయాలను చట్టపరంగా అడ్డుకొనేందుకు ఉన్న అంశాలపై అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎక్సైజ్‌, సిటీ పోలీసు, ఇతర చట్టాలను పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో..

మత్తులో తేలిపోయేందుకు వైట్‌నర్‌(Whitener users)ను వినియోగిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో దీని అమ్మకాలు రెండేళ్ల నుంచి వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మరింత పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొందరు విద్యార్థులు వైట్‌నర్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. జనగామ, వర్ధన్నపేట, పాకాల తదితర మండలాల్లో కొందరు యువకులు, విద్యార్థులు మాక్సిబ్రాండ్‌ వైట్‌నర్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

రైల్వేస్టేషన్లు అడ్డాలు..

హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని కొన్ని రైల్వేస్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాలు వైట్‌నర్‌ వినియోగించేవారికి అడ్డాలుగా మారాయి. కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లకు కాస్తదూరంగా రైలు పట్టాలపై కొందరు యువకులు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ వైట్‌నర్‌ పీలుస్తూనే ఉంటున్నారు. ఈ మత్తులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. పాతబస్తీలోని చార్మినార్‌, బహదూర్‌పురా, కామాటిపుర ప్రాంతాల్లో ఇటీవల కొందరు వైట్‌నర్‌ మత్తులో అర్ధరాత్రి దాటాక అపస్మారక స్థితిలో రోడ్లపైపడిపోయిన సంఘటనలున్నాయి. వైట్‌నర్‌ మత్తు ప్రమాదకరం.. వినియోగించవద్దంటూ చార్మినార్‌ పోలీసులు ఇటీవలే 50 మంది యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details