కోల్‌కతాలో అపహరణకు గురైన బాలికను తెలంగాణ మహిళా భద్రత విభాగం పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో గుర్తించారు. నాలుగు నెలల అనంతరం బాలికకు నిందితుడి చెర నుంచి విముక్తి కలిగించారు. జూన్ 19న పశ్చిమ్‌బెంగాల్‌లోని కనకుల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాల ఆధారంగా బాలికను రక్షించడంతో పాటు నిందితుడినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Girl Trafficking : కోల్‌కతా నుంచి బాలిక అక్రమ రవాణా.. 4 నెలల తర్వాత... - కోల్‌కతా బాలికను కాపాడిన తెలంగాణ మహిళా భద్రత విభాగం
కోల్‌కతాకు చెందిన బాలికను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన వ్యక్తిని మహిళా భద్రత విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అతడి చెర నుంచి బాలికకు విముక్తి కలిగించి.. సఖి కేంద్రానికి పంపించారు.
కోల్‌కతాకు చెందిన బాలిక(17)ను అదే ప్రాంతానికి చెందిన సంతు పరమాణిక్ అక్రమంగా హైదరాబాద్ తీసుకొచ్చాడని చైల్డ్ హెల్ప్‌లైన్ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ మహిళా భద్రత విభాగం నేతృత్వంలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం రంగంలోకి దిగింది. ఎస్సై హరీశ్ నేతృత్వంలోని బృందం బాలికతో పాటు సంతు వివరాల ఆధారంగా దర్యాప్తు ఆరంభించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కాల్ డేటా వివరాలను సేకరించి వారు చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించింది. బాలికను సఖి కేంద్రానికి పంపించి నిందితుడిని పోలీసులకు అప్పగించింది.