తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చిన ఘటన.. ఆటపట్టించడానికే అంటూ..! - హైదరాబాద్‌లో బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చివేత

ఉతర్‌ప్రదేశ్‌ ఖుషీనగర్‌కు చెందిన బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన ఘటనలో అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న యూపీ పోలీసులు తెలంగాణ పోలీసులను సంప్రదించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు బాధిత యువకుడిని కస్టడీలోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

kushinagar man cracker case
kushinagar man cracker case

By

Published : Nov 2, 2022, 2:12 PM IST

హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన ఘటనపై యూపీ పోలీసులు తెలంగాణ పోలీసులను సంప్రదించారు. ఈ క్రమంలో యూపీ అధికారుల విజ్ఞప్తితో రాష్ట్ర పోలీసులు బాధిత యువకుడిని కలిశారు. బాలుడు పనిచేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారోనే అంశాల గురించి ఆరా తీశారు.

హైదరాబాద్‌లో యూపీకి చెందిన ఓ బాలుడితో కొందరు యువకులు అమానుషంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన అతడి తల్లిదండ్రులు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మమ్మల్ని సంప్రదించగా మేం ఇవాళ బాధిత బాలుడి వద్దకు వెళ్లాం. ఘటన గురించి ఆరా తీశాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఘటన గురించి అడగ్గా తనను ఆటపట్టించడానికి అలా చేశారని చెప్పాడు. బాలుడి ఆధార్ కార్డు చూశామని.. అతడు ఇంకా మైనరే కానీ ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు అని పోలీస్ అధికారి రఘురామ్ తెలిపారు.

అసలేం జరిగిందంటే.. ఉత్తర్​ప్రదేశ్​ ఖుషీనగర్​కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. బాసరగుడిలోని టపాసుల కర్మాగారంలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం పంపించారు. కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. బాలుడుని కదలకుండా గట్టిగా పట్టుకున్న యువకులు.. వదిలిపెట్టాలని ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు.

తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్​ఫోన్ కూడా లాక్కున్నారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details