తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రైం కహానీ: పోయింది రూ.93 కోట్లు.. దొరికింది రూ.50 కోట్లు!

రాష్ట్రంలో చోరీ సంబంధిత నేరాల్లో 50 శాతం సొత్తును మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. సగం శాతం కేసులు కొలిక్కి రావటం లేదు. గతంతో పోల్చితే దొంగతనాలు, దోపిడీలు, గొలుసుచోరీలు భారీగా తగ్గినా... ఛేదించడంలో పోలీసులు పూర్తిగా సఫలం కాలేకపోతున్నారు.

gold
gold

By

Published : Jan 25, 2021, 7:02 AM IST

రాష్ట్రంలో చోరీ సంబంధిత నేరాల్లో సుమారు సగం శాతం కేసులు కొలిక్కి రావటం లేదు. గతంతో పోల్చితే దొంగతనాలు, దోపిడీలు, గొలుసుచోరీలు భారీగా తగ్గాయి. కానీ, జరుగుతున్న నేరాల్ని ఛేదించడంలో పోలీసులు పూర్తిగా సఫలం కాలేకపోతున్నారు. ఏటా నమోదవుతున్న కేసుల్లో 50 శాతానికి కాస్త అటూఇటూగానే సొత్తును స్వాధీనం చేసుకోగలుగుతున్నారు.

ఒక్క శాతం మాత్రమే అదనం

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చోరీ సంబంధిత నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తులో 54 శాతమే స్వాధీనం చేసుకోగలిగారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది ఒక్క శాతం మాత్రమే అదనం. ఎక్కువగా అంతర్రాష్ట్ర ముఠాలే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నాయని, వారిని పట్టుకొని సొత్తు స్వాధీనం చేసుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

తప్పని ఇబ్బందులు

నేరాలు జరిగాక దొంగల్ని గుర్తించడం ఒక ఎత్తయితే.. వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవటం మరో ఎత్తు.. ఈ ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటోందనేది దర్యాప్తు బృందాల అభిప్రాయం. ముఖ్యంగా ఇరానీ, బవారియా, రాంజీ, జల్పాయ్‌గురి, చెడ్డీగ్యాంగ్‌, కంజర్‌భట్‌, కంజర్‌ఖేర్వా, మేరట్‌.. తదితర ఉత్తరాది ముఠాలు పాల్పడుతున్న నేరాల్ని ఛేదించేందుకు పోలీస్‌ బృందాలు రోజుల తరబడి ఆయా రాష్ట్రాల్లో మకాం వేయాల్సి వస్తోంది. ఒకవేళ వారు చిక్కినా.. అప్పటికే చోరీ సొత్తును ఖర్చు చేసేస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ నేరాల వైపు మళ్లడంతో..

గతంలో ఎక్కువగా జరిగే ఇలాంటి నేరాల స్థానంలోకి సైబర్‌ నేరాలు వచ్చి చేరడంతో పోలీసులు ఎక్కువగా వాటిపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జామ్‌తారా, భరత్‌పూర్‌.. తదితర ముఠాలు సైబర్‌ నేరాల వైపు మళ్లడంతో పోలీసులు ఈ ముఠాల కార్యకలాపాల నియంత్రణకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చోరీ సంబంధ నేరాల్లో సొత్తు స్వాధీన ప్రక్రియలో మందగమనం చోటు చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి :మురికి కాలువ నుంచి బయటికి తీసి... తల్లి చెంతకు చేర్చి

ABOUT THE AUTHOR

...view details