ఆన్‌లైన్ రుణా యాప్‌ల డైరెక్టర్ హేమంత్ జాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని భాగల్పూర్ పోలీసుల సహకారంతో సోమవారం ఇషాచాక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో హేమంత్ జాను పట్టుకున్నారు. గుజ్జీ చంద్రమోహన్ ఆత్మహత్యకు రుణ యాప్‌ల వేధింపులే కారణమని కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పలు చోట్ల గాలింపు చేపట్టి.. బిహార్‌లో హేమంత జాను పట్టుకున్నారు.
దా'రుణ' యాప్‌ల కేసులో మరో నిందితుడు అరెస్ట్ - రుణ యాప్ తాజా వార్తలు
దా'రుణ' యాప్‌ల కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రుణ యాప్‌ల డైరెక్టర్ హేమంత్ జాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. బిహార్‌లోని ఇషాక్‌చక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సబ్జీ మండిలోని హేమంత్ జాను అరెస్ట్ చేశారు.
హేమంత్ కింద దాదాపు 150 మంది పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరు ఆన్‌లైన్ రుణ యాప్‌ల్లో రుణాలు ఇచ్చి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. పాన్ పాన్, రియోక్రాప్, క్యాష్ మ్యాప్, రూపి ప్లస్, కుష్ క్యాష్, మనీ మోర్, హోమ్ కరోరి, క్యాష్ సీడ్, క్యాష్ ఇరో మొదలైనవి రుణ యాప్‌ల ద్వారా రుణాలిచ్చారని పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:వృద్ధురాలి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు