తెలంగాణ

telangana

ETV Bharat / crime

Minister Satyavathi's Father Passes Away: మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం.. సీఎం సంతాపం - మంత్రి సత్యవతి రాఠోడ్​ తండ్రి మృతి

Minister Satyavathi's Father Passes Away : తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న మంత్రి.. మేడారం పర్యటన నుంచి బయలుదేరారు.

Minister Satyavathi's Father Passes Away
Minister Satyavathi's Father Passes Away

By

Published : Feb 17, 2022, 8:11 AM IST

Updated : Feb 17, 2022, 8:58 AM IST

Minister Satyavathi's Father Passes Away : రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఉన్న సత్యవతి రాఠోడ్.. తండ్రి మరణవార్త తెలిసి అక్కణ్నుంచి తిరుగుపయనమయ్యారు. మంత్రి సత్యవతి తండ్రి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్​ సత్యవతి రాఠోడ్​ను ఫోన్​లో పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Last Updated : Feb 17, 2022, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details